🙏 శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి జయహో!     🔱 నాగ పంచమి మహోత్సవానికి స్వాగతం     🌸 రోజువారీ అభిషేక సేవలు అందుబాటులో ఉన్నాయి     📿 ఆన్‌లైన్‌లో సేవలు బుక్ చేసుకోండి     🙏 దర్శన సమయం: ఉ. 5:00 – రా. 9:00 🙏 Jai Sri Subrahmanyeswara Swamy!     🔱 Welcome to Naga Panchami Mahotsavam     🌸 Daily Abhisheka Sevas Available     📿 Book Sevas Online     🙏 Darshan Timings: 5:00 AM – 9:00 PM
శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్ధానం { పుట్ట }
నాగులపాడు, ఆంధ్రప్రదేశ్
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam { Putta }
Nagulapadu, Andhra Pradesh
Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam · Nagulapadu
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00 – మ. 12:00
సా. 4:00 – రా. 9:00
5:00 AM – 12:00 PM
4:00 PM – 9:00 PM
🙏 విరాళం ఇవ్వండిDonate Now
దర్శన సమయంDarshan Timings ఉ. 5:00–మ. 12:00  |  సా. 4:00–రా. 9:00 5:00 AM–12:00 PM  |  4:00 PM–9:00 PM
🙏 విరాళంDonate
మెనూMenu
హోమ్Home
క్షేత్ర చరిత్రKshetra History
సేవ విరాళంSeva Donation
సేవ దర్శన్ ఉత్సవ్Seva Darshan Utsav
శ్లోకాలు స్తోత్రంSlokas Stotram
సంప్రదించండిContact Us
🙏 విరాళం ఇవ్వండిDonate Now
Kshetra Avirbhavam

క్షేత్ర ఆవిర్భావం

Temple Origin & History

క్షేత్ర ఆవిర్భావం

Origin of the Temple

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్థల పురాణం. సుమారు కొన్ని తరాల క్రితం నాగులపాడులోని వ్యవసాయ క్షేత్రములలో స్వయంభూ సుబ్రహ్మణ్య క్షేత్రము ఒక పుట్టగా ఏర్పడి ఉన్నది. తర్వాత పక్కనే నాగుల చెరువు ఉన్నది. ఆ చెరువులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శిరస్సుపై నాగమణితో తెల్లని శరీరంతో భక్తులకు సర్పరూపంలో సుమారు రెండు అడుగుల లోపు దర్శనం ఇచ్చినారు. స్వామివారు సర్ప రూపంలో నాగుల చెరువు పుట్ట వద్ద సంచరిస్తూ ఉంటారు. అప్పటి ఆలయ ప్రప్రథమ ప్రధానార్చక బాధ్యతలు నిర్వహించిన వేద మూర్తులు బ్రహ్మశ్రీ అవ్వారి రాఘవయ్య పాకయజి గారికి స్వామివారు రోజూ ప్రత్యక్ష దర్శనం ఇచ్చేవారు. ఆ స్వామివారి పేరు మీద నాగులపాడు ఊరు ఏర్పడింది.

The sacred temple of Sri Subrahmanyeswara Swamy is a self-manifested divine site located in Nagulapadu village, Pedanandipadu Mandal, Guntur district. Several generations ago, a divine anthill emerged in agricultural lands, marking the presence of Lord Subrahmanya. Nearby lies Nagula Cheruvu, where devotees witnessed the Lord in serpent form with a radiant white body and a gem on His hood. The deity is believed to move around the anthill near the pond. The first chief priest, Brahmasri Avvari Raghavayya Pakayaji, was blessed with daily divine darshan during his early morning rituals. The village Nagulapadu is named after this divine manifestation.

స్వామి ఆవిర్భావ విశేషాలు

Divine Significance

సుబ్రహ్మణ్య జనన గాధ ప్రకారం స్వామివారికి "గాంగేయుడు" అనే నామం ఉంది. ఇక్కడ స్వామివారికి నీళ్ల బిందెలతో అభిషేకం చేయడం అనాది సంప్రదాయం. అయితే పుట్ట కరిగిపోతున్నదని భావించి సుమారు 46 సంవత్సరాల క్రితం 48 శిరస్సులతో పంచలోహ కవచం ఏర్పాటు చేశారు. ఈ సర్పబంధం 48 రోజుల పాటు అనేక ఊర్లలో దర్శనమిచ్చింది. ఈ సమయంలో నామసంకీర్తన కొనసాగింది మరియు అనేక భక్తులకు ప్రత్యక్ష దర్శనాలు లభించాయి. బ్రిటిష్ కాలంలో కూడా స్వామివారు దర్శనమిచ్చినట్టు చెబుతారు. వారి పాలన తరువాత ఆలయ ఆస్తులు స్వామివారి పేరిట నమోదు చేయబడ్డాయి.

According to mythology, Lord Subrahmanya is also known as "Gangeya". Offering water for abhishekam around the anthill is an ancient tradition here. Due to concerns of erosion, a protective Panchaloha covering with 48 serpent hoods was installed about 46 years ago. This sacred serpent structure was taken in procession for 48 days, during which continuous devotional chanting took place and many devotees experienced divine visions. It is also believed that the Lord appeared before British officials, and after their rule, temple properties were officially registered in the deity's name.

క్షేత్రములోని ఉపాలయములు

Sub Temples

ఈ క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం మరియు క్షేత్రపాలకుడిగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. రావి చెట్టు, వేప చెట్టు కలిసి నారాయణ నారాయణి స్వరూపంగా ఉన్నాయి. సంతానభాగ్యంకోసం ఈ వృక్షాలకు ఉయ్యాల కడతారు. ఆదివారం, మంగళవారం, గురువారం రోజుల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వస్తారు. సమీపంలో శ్రీ గంగా పార్వతి సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయం, శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఉన్నాయి.

The temple complex includes sub-shrines of Lord Vighneswara and Kshetrapalaka Sri Abhayanjaneya Swamy. The sacred trees (Peepal and Neem) represent Narayana and Narayani, where devotees tie cradles for progeny blessings. Sundays, Tuesdays, and Thursdays attract large numbers of devotees. Nearby temples include Sri Nagalingeswara Swamy, Sri Kodanda Rama Temple, and Sri Poleramma Temple.